Friday, January 24, 2025

దిల్ రాజు తమ్ముడు విజయసింహ రెడ్డి ఇంట్లో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మాత దిల్ రాజు నివాసంలో నాలుగో రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్ విసి నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీల పరిశీలిస్తున్నారు. దిల్ రాజు కుటుంబ సభ్యుల బ్యాంక్‌ లాకర్లను ఐటి అధికారులు తెరపించారు. దిల్‌ రాజు సోదరుడు విజయసింహ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. విజయసింహారెడ్డి ఆటోమొబైల్‌ ఫీల్డ్‌లో ఉన్నారు. దిల్‌రాజు, విజయసింహ మధ్య లావాదేవీల పరిశీలిస్తున్నారు. దిల్‌రాజు నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజు మినహాయించి పలువురి సినీ ప్రముఖులపై ఐటి సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు 16 చోట్ల ఐటి అధికారులు సోదాలు చేశారు. ఐటి అధికారులు 55 బృందాలుగా విడిపోయి సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News