Monday, December 23, 2024

జానారెడ్డి ఇంట్లో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డికి షాక్ తగిలింది. ఆయన నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు చేపట్టారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన వివరాల సేకరించారు. కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత ఇంట్లో ఐటి సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం నుండి పారిజాత ఇంట్లో సోదాలు నిర్వహించారు. నవంబర్ 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి అధాయపన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News