- Advertisement -
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు చెందిన ఆరు చోట్ల ఆదాయంపన్ను(ఐటి) విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ముంబయితోపాటు లక్నోలోని సోనూ ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. సోనూసూద్‌కు చెందిన కంపెనీతో లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇటీవల ఓ డీల్ కుదిరిందని ఐటి అధికారి ఒకరు తెలిపారు. ఈ డీల్‌లో ఆదాయం పన్ను ఎగవేతకు సం బంధించిన సమాచారంతో సోదాలు నిర్వహించామని ఆ అధికారి తెలిపారు. సోనూసూద్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయిన కొన్ని రోజులకే ఐటి సోదాలు జరగడం గమనార్హం.
- Advertisement -