Monday, December 23, 2024

బడంగ్‌పేట మేయర్ ఇంట్లో ముగిసిన ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బడంగ్ పేట్ మేయర్ పారిజాతరెడ్డి ఇంట్లో ఐటి సోదాలు ముగిశాయి. అర్థరాత్రి పారిజాత ఇంట్లో నుంచి ఐటి అధికారులు వెళ్లిపోయినట్లు సమాచారం. రూ. 8 లక్షలు, కొన్ని కీలక పత్రాలను అధికారులు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ఐటి కార్యలయంలో హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీచేశారు. నామినేషన్ల దాఖలుకు ఒకరోజు ముందు హైదరాబాద్‌లోని 10 చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాలు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ గురువారం దాడులు నిర్వహించింది.

వ్యాపార లావాదేవీలకు సంబంధించి పన్ను ఎగవేత జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న కిచ్చన్నలక్ష్మారెడ్డి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిగాయి. బడంగ్‌పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి నివాసం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీప బంధువు, రియల్టర్ గిరిధర్ రెడ్డి నివాసాలపై కూడా దాడులు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News