Wednesday, January 22, 2025

మంత్రి సబితా అనుచరుడి ఇంట్లో ముగిసిన సోదాలు..

- Advertisement -
- Advertisement -

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. తెలంగాణలో సోమవారం నుంచి మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. గచ్చిబౌలిలోని మైహోం బూజాలో ఉంటున్న ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. నరేందర్ రెడ్డి ఇంట్లో రూ.7.50 కోట్లు.. ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సమకూర్చుకున్నట్లు తేలిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News