Monday, December 23, 2024

రెండో రోజు బిఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతల ఇళ్లలో రెండు రోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, ఎంపి ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటి తనిఖీలు కొనసాగుతున్నాయి. మెయిన్ లాండ్ డిజిటల్ టెక్నాలజీలో ముగ్గురు నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించారు. జెసి బ్రదర్స్ షోరూమ్‌లతో పాటు అమీర్‌పేటలోని కార్పొరేట్ ఆఫీసులో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి.

Also Read: వైద్య రంగానికి పెద్ద పీట వేసిన సిఎం కెసిఆర్

జెసి స్పిన్నింగ్స్ మిల్స్, జెసి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్థన్ రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో సైతం ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన తీర్థా ప్రాజెక్ట్ పై ఐటి నజర్ పెట్టింది. ముగ్గురు నేత సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలపై ఐటి దృష్టి పెట్టింది. ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటి గుర్తించింది. ఐటి అధికారులు బ్యాంక్ లాకర్లను సైతం ఓపెన్ చేయడంతో పాటు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News