Thursday, December 19, 2024

బిఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై ముగిసిన ఐటి సోదాలు…..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలపై ఐటి సోదాలు ముగిశాయి. గత బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఐటి సోదాలు ప్రారంభంకాగా శనివారం అర్ధరాత్రి 2 గంటలకు ముగిశాయి. ఐటి అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేపట్టారు. అర్ధరాత్రి రెండు గంటలకు ఎమ్మెల్యేల ఇంటి నుంచి ఐటి అధికారుల బృందం వెళ్లిపోయింది. మూడు రోజులపాటు జరిపిన సోదాల్లో పలు డాక్యుమెంట్లను ఐటి శాఖ స్వాధీనం చేసుకుంది. బ్యాంకు లాకర్స్ కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లపై ఐటి ఆరా తీసింది. సోదాల అనంతరం ఐటి అధికారులు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

Also Read: రోహిత్‌కు విశ్రాంతి… కెప్టెన్‌గా రహానే?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News