- Advertisement -
హైదరాబాద్: శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని హెడ్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎపి, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. అధికారులు రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. లావాదేవీల సాఫ్ట్‌వేర్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు. శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలోనూ రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నవిషయం విధితమే.
- Advertisement -