హైదరాబాద్: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌విసి, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తున్నారు. ఐటి రిటర్న్స్ భారీగా ఉండడంతో అధికారులు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాత దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఈ రోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. ఎస్‌విసి కార్యాలయంలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీలక డాక్యుమెంట్లను ఐటీ బృందం పరిశీలించింది. ఎస్‌విసి ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకొచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు, ట్యాక్స్ రిటర్న్స్‌పై ఆరా తీస్తున్నారు. రేపు కూడా ఐటి సోదాలు జరిగే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు మంగళవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రెండో రోజు ఎస్‌విసి, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి సోదాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -