Saturday, December 21, 2024

బిబిసి ఆఫీసుల్లో కొనసాగుతున్న ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: బిబిసి ఇండియాకు చెందిన కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) మంగళవారం చేపట్టిన సర్వే రెండవరోజు బుధవారం నాడు కూడా కొనసాగుతోంది. సంస్థకు చెందిన ఆర్థిక వివరాలకు సంబంధించిన ఎలెక్ట్రానిక్, పత్రాలను కాపీలు తయారుచేస్తున్నట్లు ఐటి అధికారులుబుధవారం తెలిపారు. పన్ను ఎగవేత ఆరోపణలపై బిబిసికి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో సర్వే చేపట్టినట్లు ఐటి అధికారులు మంగళవారం ప్రకటించారు. మంగళశారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సర్వే ఇప్పటికీ కొనసాగుతున్నట్లు వర్గాలు తెలిపాయి. ఆర్థిక, ఇతర విభాగాలకు చెందిన బిబిసి సిబ్బందితో మాట్లాడిన అధికారులు జర్నలిస్టులు, ఇతర సిబ్బంది మంగళవారం రాత్రి బయటకు వెళ్లడానికి అనుమతించారు. సోదాలలో భాగంగా కొన్ని కంప్యూటర్ భాగాలను, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా..బిబిసి కార్యాలయాలపై ఐటి దాడులను కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తూ ఈ దాడులను ఖండించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News