Sunday, December 22, 2024

గ్రామంలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మెదక్: గ్రామపంచాయతీలలో 9 వాల్ పెయింటింగ్స్ కలిగి ఉండాలని, గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎస్‌బిఎం డైరెక్టర్ సురేష్‌బాబు అన్నారు. బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023లో భాగంగా కమిషనర్ కార్యాలయం నుంచి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గ్రామపంచాయతీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డు ఉన్నందువలన గ్రామ పరిసరాలలో ప్రతిరోజు ఇంటివద్ద చెత్తను వేరు చేసి తడి, పొడి చెత్త గ్రామపంచాయతీ వర్కర్స్‌కి ఇవ్వాలని, వారు ట్రాక్టర్ నుంచి తీసుకొని వెళ్లి గ్రామంలో ఉన్నటువంటి సెగ్రిగేషన్ షెడ్ దగ్గరికి వెళ్లి మళ్లీ వేరు చేసి తడి చెత్తను ఎరువుగా తయారు చేయాలన్నారు.

ప్రతి ఇంటికి కిచెన్ గార్డెన్ ఉండాలన్నారు. గ్రామపంచాయతీలో ఉన్న అంగన్‌వాడీ, స్కూల్, పంచాయతీ భవనం వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డిప్యూటీ సిఈఓ, డిపిఓ, అడిషనల్ పిడి, డిఎల్‌పిఓలు, ఎంపిడిఓలు, ఎంపిఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News