- అదనపు కలెక్టర్ రమేష్
మెదక్ : గోదాంల వద్ద ఎక్కువ లారీలు పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలని, లారీలు రాగానే ఆన్‌లోడ్ చేసేవిధంగా హామాలి కాంట్రాక్టర్, గోదాం ఇంచార్జీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయం పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ఆదేశించారు. సోమవారం ప్రజావా ణి కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అదికారుల తో బఫర్ గోదాం ఇంచార్జీలతో, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, హామాలీ కాంట్రాక్టర్లతో సీఎంఆర్ బియ్యం డె లివరీ, గోదాంల వద్ద హామాలీ సమస్యలు, గోదాంలో ఖాళీ స్థలం, ఇంకా డెలివరీ చేయాల్సిన బియ్యం వేగవంతంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. పౌర సరఫరాల శాఖ క్వాలిటీ అధికారులు నాణ్యత కలిగిన బియ్యం పాస్ చేయడంతో వేగవంతం చేయాలని సూచించారు. బియ్యం డెలివరీ పెం డింగ్ ఎక్కువగా ఉన్నందున త్వరితగతిన బియ్యం డెలివరీ చేసి ఖరీఫ్, రబీ 2021-22 పూర్తి చేయాలని అ లాగే 25శాతం పెనాల్టీతో అదనంగా ఖరీఫ్ 2022/-23, రబీకి సంబందించిన రోజువారి టార్గెట్‌గా 28 94.40 టన్నులు 100 ఏసికెలా ఎఫ్‌సిఐకి పంపాలని ఆదేశించారు.
ఖరీఫ్ 2021-/22, రబీ 2021/-22 వా రం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిజెక్ట్ అయిన బియ్యాన్ని వెంటనే గోదాం నుం చి రైస్‌మిల్లర్ తిరిగి తీసుకెళ్లె విధంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే తీసుకెళ్లే విధంగా మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. అదికారులు యుద్ద ప్రాతిపదికన మిల్లర్లు బియ్యం డెలివరీ పూర్తి చేసేవిధంగా ఏర్పాట్లు చేయాలని, ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీనివాస్, బఫర్ గోదాం ఇంచార్జీలు, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్లు, హామాలీ కాంట్రాక్టర్లు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రపాల్, ఏరియా రైస్ మిల్లర్స్, రా, బాయిల్డ్ మిల్లువారు పూర్తి స్థాయిలో సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇతర అధికారులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్లకు రోజువారి టార్గెట్ తప్పనిసరిగా డెలివర్డ్ చేయాలని మరోసారి తెలిపారు.