Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టితోనే ప్రతి జిల్లాకు ఐటి టవర్

- Advertisement -
- Advertisement -
  • ఐటి టవర్ ఏర్పాటుతో స్థానిక యువకులకు ఉద్యోగాలు
  • రేసు ఐటి టవర్‌ను ప్రారంభించనున్న మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు
  • పోలీస్ కన్వెన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళాకు భారీ స్పందన
  • జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట: సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టితోనే ప్రతి జిల్లాకు ఒక్క ఐటి టవర్ ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సిద్దిపేట శివారులో నూతనంగా నిర్మించిన ఐటి టవర్ ప్రారంభోత్సవ పనులను ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఐటి టవర్ ఏర్పాటుతో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నేడు మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు సిద్దిపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి రూ. 63 కోట్లతో నిర్మించిన ఐటి టవర్‌ను ప్రారంభిస్తారన్నారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు వివరించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట సిపి శ్వేత, ప్రజాప్రతినిధులు, నా యకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపా ల్ రెడ్డి, జంగిటి కనకరాజు, దేవునూరి చంద్రకాంత్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News