Monday, January 27, 2025

యువత చెంతకే ఐటి టవర్ : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మార్చ్ నెలాఖరు లో ఐటి టవర్ పూర్తి కావాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట లో నిర్మిస్తున్న ఐటి టవర్ పనులను మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్ధాయి లో కలియ తిరుగుతు పరిశీలించారు. సిద్దిపేట నిరుద్యోగ యువత ముంగిట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తొందరలోనే రాబోతునాయని మంత్రి హరీష్ రావు అన్నారు. క్షేత్ర స్ధాయి లో టవర్ పనులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు సూచనలు చేశారు. పనుల వేగవంతంగా చేపట్టాలని చెప్పారు.

సిద్దిపేట స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పం తో సిద్దిపేటలో ఐటి టవర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట ప్రాంత యువత కు గొప్ప వరం ఐటి టవర్ అని అన్నారు.  ఏప్రిల్ మొదటి వారం లో ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News