Monday, December 23, 2024

తెలంగాణ ఆచరిస్తది… దేశం అనుసరిస్తది

- Advertisement -
- Advertisement -

ఎన్నికల నినాదాలను నిజం చేసిన నాయకుడు కెసిఆర్ 
తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి
మిషన్ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేట మంచినీటి పథకమే
ప్రతి నియోజక వర్గం సిద్దిపేటలా అభివృద్ధి చెందిన నాడే బంగారు తెలంగాణ కల సాకారం: మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/కొండపాక: తెలంగాణ ఆచరిస్తది… దేశం అనుసరిస్తదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం కొండపాక మండల పరిధిలోని దుద్దెడ శివారులోని నాగులబండ వద్ద నూతనంగా రూ. 63 కోట్లతో నిర్మించిన ఐటి టవర్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ తెలంగాణలో ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆచరించిన దాన్ని కేంద్రం కాఫీ కొ ట్టి దేశంలో అనుసరిస్తుందన్నారు. దానికి నిదర్శనం హర్ ఘర్ జల్‌తోపాటు మరెన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టిందన్నారు. నాడు తిట్టుకున్న వాళ్లే నేడు సిఎం కెసిఆర్‌ను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారన్నారు. కాద న్న, రాదన్న రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను చూసి విపక్షా లు ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఈ ప్ర యత్నాలను తిప్పి కొట్టాలని రానున్న రోజుల్లో హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్‌ను ఆశీర్వదించాలన్నారు.

గతంలో ఎన్నో పార్టీలు ఎన్నికల హమీలు, హామీలుగానే మిగిలేవని కానీ హామీలను నిజం చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ అన్నా రు. ప్రతి నియోజక వర్గం సిద్దిపేటలా అభివృద్ధి చెందిన నాడే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని మ ంత్రి కెటిఆర్ అన్నారు. మిషన్ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేట మంచినీటి పథకమేనని నాడు కరీంనగర్ నుంచి మానేరు నీటిని సిద్దిపేటకు తీసుకువచ్చి సిద్దిపేట నియోజక వర్గంలోని ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేశారని అదే స్ఫూర్తితో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టి రాష్ట్రంలో ని మారుమూల పల్లెల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరిజలాలను అందించి దేశ గర్వించదగ్గ సిఎంగా కెసిఆర్ నిలిచాడన్నారు. ఐటి టవర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని 720 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికి వారి ఇండ్లల్లో కాంతులు నింపామన్నారు. ఐటి టవర్‌ను మరింత విస్తరించడానికి వెంటనే సంబంధిత మార్గదర్శకాలను రూపోందిస్తామన్నారు. ఈ ఐటి టవర్ లో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ ని దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలన్నారు.

స్వచ్ఛబడి కార్యక్రమం అద్భుతంగా ఉందని దీనిని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐటి రంగంలోనే కాకుండా సమాంతరంగా అభివృద్ధి చెందినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించి ఆటోనగర్ అభివృద్ధి పరిచి త్వరలోనే మందపల్లి శివారులో ప్రారంభించడానికి సి ద్ధంగా ఉందన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాంతంలోని ఆయిల్ ఫామ్ రైతులను ఆర్థిక అభివృద్ధి దిశగా నర్మెటలో ఆయిల్‌పామ్ ప్యాక్టరీ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగాలు అంటే జంట నగరాలకే పరిమితం కాకుండా మెట్రో పాలిటన్ నగరాల ను తీసి పోయేలా జిల్లాలలో ఐటి హబ్‌లను ఏర్పాటు చేసి సాప్ట్‌వేర్ ఉద్యోగులను తయారు చేస్తున్నామన్నారు. 3 శాతం జనాభా కలిగిన తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు రావడం గర్వకారణమన్నారు. తెలంగాణకు జన్మనిచ్చింది సిద్దిపేట గడ్డ అని ఈ గడ్డ నుండే ఉద్యమం ప్రారంభించి కెసిఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చే శారు. అభివృద్ధికి దిక్యూచి సిద్దిపేటేనని మంత్రి కేటిఆర్ అన్నారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత స మతుల్య సమ్మిళిత అభివృద్ధి అని కెటిఆర్ అన్నారు. సిద్దిపేటను చూసి ఆసూయ పడేలా మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట అభివృద్ధిని చేస్తున్నారని కొనియాడారు.

అంతకుము ందు వేదికపై కెటిఆర్ హరీశ్‌రావులు ఆత్మీయంగా అలింగనం చేసుకొని సభికులను ఉత్సాహ పరిచారు. ఎమ్మెల్యేలు వొడితల సతీష్, యాదగిరిరెడ్డి, ఎ మ్మెల్సీలు దేశప తి శ్రీనివాస్, యాదవరెడ్డి, టిఎస్‌ఐపాస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు వం టేరు ప్రతాప్‌రెడ్డి, సాయిచంద్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రో జాశర్మ, పరిశ్రమ ల శాఖ ఎండి, సెక్రటరీలు నర్సింహ్మారెడ్డి, జయేశ్ రంజ న్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండపాక జడ్పిటిసి అనంతుల ఆశ్వీని ప్రశాంత్, ఎంపిపి ర్యాగల సుగుణ దుర్గయ్య, కొండపాక మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, ఎంపిటిసి బాలాజీ, ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News