Monday, December 23, 2024

ఐటీ టవర్ పనులు వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ:పట్టణంలో నిర్మాణంలో ఐటీ టవర్ పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్లగొండ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లిలో ని అర్బన్ పార్కులో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు.

ఇరిగేషన్ శాఖ వారితో చర్చించి నీరు నిలిచే చోట నీటికొలను లాగా ఏర్పాటు చేయాలని అన్నారు. మర్రిగూడ బైపాస్ జంక్షన్ ను పరిశీలించి చౌరస్తాలోని పోల్ వద్ద చెడిపోయిన విగ్రహం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కు బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులలో ఇది పూర్తవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఐటీ టవర్ నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం నీటి సౌకర్యం, విద్యుత్తు, ఇంటర్నెట్ కనెక్షన్లను వెంటనే,బస్ బే ఐ.టి.టవర్ ను ఆనుకుని పాలి టెక్నిక్ కళాశాల వరకు కెనాల్ ను సుందరీకరణ చేయాలని ఆయన సూచించారు.

అనంతరము బీట్ మార్కెట్లోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించి నీటి సదుపాయం విద్యుత్ సౌకర్యం మొదలగు మౌలిక సౌకర్యాలు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మహిళలకు పురుషులకు వేరువేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అంతేగాక శిథిలావస్థలో ఉన్న కట్టడాలు గోడలను వెంటనే తొలగించాలన్నారు.జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పురపాలక శాఖ ద్వారా ఏర్పాటుచేసిన పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్ర భవనంను కలెక్టర్ తనిఖీ చేశారు.

డార్మిటరీ గదులు,టాయి లేట్ లు పరిశీలించారు.పట్టణంలో నిరాశ్రయులు ఎంత మంది ఉన్నారు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణాచారి,పబ్లిక్ హెల్త్ ఈ .ఈ.సత్య నారాయణ,మున్సిపల్ ఇంజనీర్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News