Monday, December 23, 2024

రైతును రాజు చేసింది సిఎం కెసిఆరే

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్: రైతును రాజు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాం విలేజ్ నెంబర్ 5 లోని వేధికలో రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ కరెంట్, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా చెరువుల బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి రైతన్నల అత్మహత్యలకు కారణమైందని అన్నారు.

తెలంగాణ రైతులకుఉ 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్‌రెడ్డి మాట్లాడడం రైతుల కడుపుకోట్టే విధంగా ఉందని, రేవంత్‌రేడ్డి బహిరంగ క్షమాపణ చేప్పాలని, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసిఅర్ నాయకత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉంన్నారని, కేసిఅర్‌కు రైతును రాజు చేయడమే లక్షమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్‌చైర్మన్ కోనేరు కృష్ణరావు, మార్కెట్ కమిటి చైర్మన్ కాసం శ్రీనివాస్, ఎంపిపి చిపురుశెట్టి శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News