Thursday, January 23, 2025

కాంగ్రెస్ హయాంలోనే సబ్బండ వర్గాలకు లబ్ధి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ హాయాంలోనే సబ్బండ వర్గాల ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరిందని టిపిసిసి ప్రధానకార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలం తుంబాయి తండాకు చెందిన వివిద పార్టీల కార్యకర్తలు చలమల్ల కృష్ణారెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో రాచకొండ ప్రాంతంలోని వేలాది మంది కుటుంబాలకు 4 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడం జరిగిందన్నారు. పూరిగుడిసెలో నివసించిన వారికి ఇదిరమ్మ ఇం డ్లను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. తండాల అభివృద్ధికి అధిక నిధులు, వ్యవసాయానికి ఉచితంగా కాడెడ్లు, రక్షిత మంచినీటి కోసం చేతి పంపుల నిర్మాణం, కరంటు సౌకర్యం, లింకు రోడ్ల సౌకర్యం లాంటి అనేక సౌకర్యాలను కాంగ్రేస్ పాలనలోనే కల్పించడం జరిగిందన్నారు. లంబాడీలంతా కాంగ్రెస్ పక్షాన నిలబడాలని కోరారు.

రాబోయే రాజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కెసిఆర్, మోడీ మాటలకు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు తోడుగా ఉండి పోడు భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని, రైతు డిక్లెరేషన్, యువత డిక్లెరేషన్, మహిళా డిక్లెరేషన్ లాంటి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాసమల్ల యాదయ్య, అక్భర్ అలీ, మందుగుల బాలకృష్ణ, మాజీ ఎంపిపి బుజ్జి, జింకల మారయ్య, బిట్టు సత్యనారాయణ, చాపల నర్సింహ్మ, గూడూరు వెంకట్‌రెడ్డి, వీరమల్ల స్వామి, చిలువేరు నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News