Sunday, December 22, 2024

పునాస త్రైమాసిక సాహిత్య పత్రికను ఆవిష్కరించిన జూపల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో భాగంగా సాహితీవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ పునాస’ త్రైమాసిక సాహిత్య పత్రికను ప్రచురించడం శుభపరిణామం అని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని తన చాంబర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన ’పునాస’ త్రైమాసిక సాహిత్య పత్రికను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు.

తెలుగు సాహిత్యంలో సృజన శీలతను ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ సాహిత్య అకాడమీ పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ పత్రికలో అనేక మంది సాహిత్యకారులు రచించిన వ్యాసాలు, కథలు, కవిత్వంతో పాటు అనేక పుస్తకాల సమీక్షలు ప్రచురించడం బాగుందన్నారు. రాష్ట్రంలో రచయితలు కవులు ఎంతో మంది ఉన్నారని, వారి నుంచి మరిన్ని రచనలను రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ , పర్యాటక శాఖ ఎండి రమేష్ నాయుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. నామోజు బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News