Monday, December 23, 2024

కెసిఆర్‌ను ఓడించడం ఈజీ కాదు

- Advertisement -
- Advertisement -

సంక్షేమ పథకాల్లో ఆయనను ఢీ కొనలేం

మల్కాజ్ గిరి నుంచి పార్లమెంట్ బరిలో నిలుస్తా
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓడించడం కష్టం అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జీ పి.మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కొట్టలేం.. కెసిఆర్‌ను కొట్టాలంటే ఆయన ఇచ్చిన హామీలు అమలుతోనే కొట్టాలి లేకుంటే కెసిఆర్‌ను ఓడించటం కష్టం అన్నారు. కెసిఆర్‌ను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ ఒక్కటే అని అన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోటీ ఉందన్నారు. కానీ.. సిద్దరామయ్య మాదిరి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మాస్ లీడర్ లేరని తెలిపారు. కర్ణాటక మాదిరి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోవచ్చని ఆయన అన్నారు.కర్ణాటకలో లాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినా వారిని ప్రజలు నమ్మరు.. ఎందుకంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళకంటే ఒకడుగు ముందే ఉన్నాడు అని మురళీధర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఉండరు అనేది ప్రజల్లో నమ్మకం.. దాన్ని పోగొట్టడం ఆ పార్టీకి సాధ్యం కాదు.. ఆ పార్టీ పెద్ద లీడర్ లే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యనించారు. ప్రతీసారి సంక్షేమ పథకాలతో కూడా కెసిఆర్ గెలవలేరన్నారు. తెలంగాణలో ఉన్న 65 శాతం యువత తలుచుకుంటేనా బిఆర్‌ఎస్‌ను ఓడించగలరని అన్నారు. యువతతోనే తెలంగాణలో ప్రభుత్వ మార్పిడి జరుగుతుందన్నారు. కెసిఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు… పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేసీఆర్ తిరుగుతున్నారు.. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుపోవటంలో బండి సంజయ్ విఫలమైయ్యారని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ మార్పు కారణంగా బిజెపి డ్యామేజీ అయిందనడం కరెక్ట్ కాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారో మార్చిన వాళ్లకు బాగా తెలుసని.. నేతలను కలుపుకుపోవటం లేదనే బండి సంజయ్‌ను తప్పించారని వెల్లడించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు మురళీధరరావు వెల్లడించారు.అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందేనని ఆయన తెలిపారు. అందుకే జైళ్లు కడుతున్నామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News