Wednesday, April 2, 2025

ఈనెల 10, 11, 12 తేదీల్లో పలుచోట్ల వడగండ్ల వాన

- Advertisement -
- Advertisement -

It will rain for three days in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఈనెల 10,11,12 తేదీల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ఉత్తరభారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యంగా అదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో జనవరి 10, 11,12వ తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, వర్షాల నేపథ్యంలో రైతులు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News