Friday, November 8, 2024

జకోవిచ్‌కు రూనే షాక్..

- Advertisement -
- Advertisement -

ఇటాలియన్ ఓపెన్.. జకోవిచ్‌కు రూనే షాక్
సెమీస్‌లో వెరోనికా, కలినినా

రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీలో జకోవిచ్ అనూహ్య ఓటమి పాలయ్యాడు. డెన్మార్క్‌కు చెందిన ఏడో సీడ్ హోల్గర్ రూనే సెర్బియా యోధుడు జకోవిచ్‌పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్ల సమరంలో రూనే 62, 46, 62 తేడాతో జకోవిచ్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే రూనే దూకుడుగా ఆడాడు. అద్భుత షాట్లతో జకోవిచ్‌ను హడలెత్తిండాడు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్‌లో మాత్రం జకోవిచ్ పుంజుకున్నాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగాడు. ఇదే సమయంలో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు.

అయితే కీలకమైన మూడో సెట్‌లో మాత్రం జకోవిచ్ చేతులెత్తేశాడు. ఈసారి రూనే పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చివరి వరకు దూకుడును కనబరుస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్ బెర్త్‌ను దక్కింకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్ వెరోనికా కుదెర్‌మోటొవా (రష్యా). 30వ సీడ్ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విజయం సాధించారు. మూడు సెట్ల హోరాహోరీ సమరంలో కలినినా 67, 76, 63 తేడాతో హద్దాద్ మయా (బ్రెజిల్)ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే చివరి వరకు నిలకడగా ఆడిన కలినినా మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో వెరోనికా 36, 63, 64తో చైనాకు చెందిన 22వ సీడ్ జెంగ్‌ను ఓడించింది. తొలి సెట్‌లో ఓడిన వెరోనికా ఆ తర్వాత రెండింటిలో గెలిచి ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News