Tuesday, January 21, 2025

ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ హత్య

- Advertisement -
- Advertisement -

ఈటానగర్: ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ హత్య చేసిన సంఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిఎఫ్‌సి ప్రాంతంలోని సియాంగ్ నది సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిక్ తాకి అనే వ్యక్తి ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఎప్రిల్ 22 నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఎప్రిల్ 24న భార్యతో తమిక్ ఫోన్‌లో మాట్లాడిన తరువాత స్విచ్ఛాఫ్ వచ్చింది. ఎప్రిల్ 28న తన భర్త కనిపించడంలేదని ఇటానగర్ పోలీస్ స్టేషన్‌లో తమిక్ భార్య ఫిర్యాదు చేసింది. టాకి స్వస్థలం ఈటానగర్‌లోని కొమసింగ్ గ్రామంలోని ఆర్‌డబ్యుడి కాలనీ. సియాంగ్ నదిలో చేతులు తాళ్లతో కటేసిన తమిక్ మృతదేహం కనిపించింది. మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిక్ ను కిడ్నాప్ చేసి చంపిన అనంతరం నదిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News