Monday, December 23, 2024

ఐటిబిపి జవాను ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ITBP Jawan commit suicide

 

న్యూఢిల్లీ: తీన్ మూర్తి భవన్ వద్ద సెక్యూరిటీ డ్యూటీలో వేసిన 31 ఏళ్ల ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్(ఐటిబిపి) జవాన్ ఆదివారం తనను తాను స్వంత రైఫిల్‌తో కాల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ వై రెడ్డి ఆదివారం ఉదయం 5 గంటలకు చనిపోయి కనిపించాడని, అతడి ప్రక్కన ఐఎన్ ఎస్‌ఎఎస్ రైఫిల్ పడి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా రెడ్డి కర్నాటకకు చెందిన వ్యక్తి. అతడు ఈ మధ్యే 30 రోజుల సెలవుపై ఊరికి వెళ్లి రెండు వారాల క్రితమే తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అతడి బెడ్‌పైన ఆత్మహత్యకు సంబంధించిన నోట్ లభించింది. అందులో అతడు భార్య, మామ తనను మానసికంగా వేధించారని రాసినట్లు అధికారులు తెలిపారు. ఆ జవాను గత సంవత్సరం అక్టోబర్‌లోనే వివాహం చేసుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News