న్యూఢిల్లీ: భారతదేశపు నెంబర్ 1 నోట్‌బుక్ బ్రాండ్ క్లాస్‌మేట్, తమ నూతన , వినూత్నమైన బాల్ పెన్‌ను క్లాస్‌మేట్ హుక్ పేరిట విడుదల చేసింది. ఈ పెన్నులో వినూత్నంగా డిజైన్ చేసిన క్లిప్ కారణంగా ఇది పౌచ్, జిప్ లేదా లూప్‌పై వేలాడదీయవచ్చు. ఈ తరరహా డిజైన్ పనితీరు కలిగిన పెన్నును దేశంలో విడుదల చేసిన మొట్టమొదటి కంపెనీలలో ఒకటిగా ఐటీసీ క్లాస్‌మేట్ నిలుస్తుంది. ఇది ఇప్నటికే జెల్ విభాగంలో అగ్రగామిగా తమ ఆక్టేన్ జెల్ శ్రేణి పెన్నులతో నిలిచింది. ఈ నూతన పెన్ను విడుదలతో బాల్ విభాగంలో కూడా అగ్రగామిగా నిలిచేందుకు బాటలు వేసింది.
ఈ ఆవిష్కరణలో భాగంగా, ఆప్నే కహా హుక్ కియా ?(హుక్ ఇట్ ఎనీవేర్) ప్రచారం ప్రారంభించింది. దీనిని వినియోగదారుల కోణంలో పెన్ను పోవడం/ఎక్కడో పెట్టి మరిచిపోవడం వంటివి చూపుతారు. పాఠశాల విద్యార్థులు కనిపించే ఈ టీవీసీ , క్లాస్‌మేట్ హుక్ యొక్క వినూత్న ప్రతిపాదనను వెల్లడిస్తుంది.
ఈ నూతన ఉత్పత్తి గురించి ఐటీసీ లిమిటెడ్, ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ ప్రొడక్ట్స్ బిజినెస్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వికాస్ గుప్తా మాట్లాడుతూ తమ అత్యున్నత నాణ్యత, వినూత్నమైన, చూడగానే ఆకట్టుకునే ఉత్పత్తులతో వినియోగదారులకు ఎప్పుడూ ఆనందం కలిగించడానికి కట్టుబడి ఉంది. విద్యార్థులు ఎప్పుడూ కూడా తమకు అబ్యాసాన్ని ఆనందంగా మార్చే ఉపకరణాలను గురించి వెదుకుతుంటారు. అదే సమయంలో వారి పనితీరు కూడా మెరుగవుతుంది. క్లాస్‌మేట్ హుక్ ఆధునిక మరియు ట్రెండీ బాల్ పెన్. ఇది వినూత్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటూనే సౌకర్యమూ అందిస్తుంది. అందువల్ల ఇది ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఎంపికగా నిలుస్తుంది అని అన్నారు.
ఈ పెన్ 0.7 మిల్లీ మీటర్ టిప్ కలిగి, మృదువైన రాత అనుభవాలను అందిస్తుంది. రెండు ఇంక్ షేడ్స్– బ్లూ, బ్లాక్ లో లభిస్తుంది. క్లాస్‌మేట్ హుక్ బాల్ పెన్స్ దేశవ్యాప్తంగా అన్ని స్టేషనరీ ఔట్‌లెట్లతో పాటుగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ–కామర్స్ వేదికలపై లభ్యమవుతుంది.