న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్ యొక్క వృద్ధి కథ కొనసాగుతూనే ఉంది. ఈ గ్రూప్ మరో ఐదు బొటిక్ ప్రోపర్టీలను తమ నూతన బ్రాండ్ స్టోరీ (Storii) బై ఐటీసీ హోటల్స్ కింద తెరిచేందుకు భాగస్వామ్యం చేసుకుంది.అత్యంత ప్రాచుర్యం పొందిన లీజర్ డెస్టినేషన్‌లు అయిన గోవా, ధర్మశాల, సోలన్, సిమోర్, కుఫ్రీలలో స్టోరీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. స్టోరీ గోవా, స్టోరీ ధర్మశాలలో ఇప్పటికే అతిథుల రాక ప్రారంభమైంది. స్టోరీ బ్రాండ్‌తో ఐటీసీ హోటల్స్ ఇప్పుడు అద్వితీయమైన అనుభవాలను హోటల్స్, రిసార్ట్స్ ద్వారా అందిస్తుంది. ఇవి క్యారెక్టర్, డిజైన్ లేదా వారసత్వం పరంగా విభిన్నంగా ఉంటాయి. ఈ బ్రాండ్ కింద ఉన్న ప్రతి హోటల్ తమదైన వినూత్నమైన కథను వినిపిస్తుంది.
తమ స్టోరీ బ్రాండ్ గురించి ఐటీసీ హోటల్స్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ చద్దా మాట్లాడుతూ ‘‘గత రెండు సంవత్సరాల నుంచి భారతదేశంలో లీజర్ ట్రావెల్ గణనీయంగా పెరుగుతుంది. మహమ్మారి అనంతర కాలంలో దేశీయ పర్యాటకులు కేవలం భారతదేశంలో తెలిసిన ప్రాంతాలను మాత్రమే కాదు, భారతదేశంలో తాము ఏమిచేయవచ్చు, ఇంకా ఏం చూడవచ్చనేది కూడా తెలుసుకుంటున్నారు. ఐటీసీ హోటల్స్ వద్ద మేము ఈ మారుతున్న ధోరణులను పరిశీలించడంతో పాటుగా బొటిక్, అనుభవ పూర్వక ఆఫరింగ్‌కు ఉన్న డిమాండ్‌ను గుర్తించాము. స్టోరీ బై ఐటీసీ హోటల్స్ ఈ విభాగానికి అవసరమైన సేవలను అందిస్తుంది’’ అని అన్నారు.
ఇటీవల గోవాలో తెరిచిన స్టోరీ బై ఐటీసీ హోటల్స్ విభిన్నమైన కథలను వెల్లడిస్తుంది. శతాబ్దాల నాటి గోడలు, పోర్చుగ్రీస్ మరియు భారతీయ సంస్కృతుల సమ్మేళనంగా ఇది ఉంటుంది. నిజానికి 1897లో నిర్మించబడిన ఈ కాసా డీ మోరాడా లేదంటే సంతోషపు నిలయం మరిన్ని కథలను వినిపించడానికి సిద్ధంగా ఉంది. ఇదే రీతిలో ధర్మశాలలో తెరిచిన స్టోరీ బై ఐటీసీ హోటల్ సైతం ఆకర్షణీయమైన గదులు, అద్భుతమైన వీక్షణను అందిస్తూ అతిథులను ఆహ్వానిస్తుంది.
ITC Hotels launches another 5 Stores