Thursday, January 23, 2025

ఐటిఐలను ఆధునీకరిస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు శంకుస్థాపన చేశారు. ఐటిఐలను ప్రక్షాళన చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమన్నారు. అందులో భాగంగానే వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా(ఏటిసీలుగా) అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి సమయాన్ని వృథా కానివ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ‘‘ నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు రూ. 15 వేలు లేక రూ. 20 వేలకే పనిచేస్తామన్నారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని అడిగితే రూ. 60 వేలు అడిగారు’’ అని వివరించారు. సర్టిఫికేట్లు జీవన స్థాయిని పెంచడం లేదని అప్పుడే అర్థమయిందన్నారు. చాలా మంది అందుకే గల్ఫ్ కు వెళుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రం నలుమూలల 65 ఐటిఐలను ఆధునీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటిఐలను అడ్వాన్స్ డ్ అప్ గ్రేడ్  ట్రైనింగ్ సెంటర్లుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 307.96 కోట్లు కాగా, టిటిఎల్ వాటా రూ. 2016.25 కోట్లని వివరించారు. ఏటిసీల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News