Saturday, November 23, 2024

ఐటి రిటర్న్ గడువు రెండు రోజులే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2022-23)కి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్)ను దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సమీపిస్తోంది. ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటి రిటర్న్‌లను దాఖలు చేసినట్టు, వీటిలో 88 శాతం తనిఖీ టేసినట్టు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. గడువు లోగా ఐటిఆర్ ఫైల్ చేయకపోతే భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. మరోవైపు జూలై 31 తేదీ దగ్గర పడుతుండటంతో, సోషల్ మీడియాలో యూజర్లు ఐటిఆర్ ఫైలింగ్ గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఐటిఆర్ దాఖలు గడువును పొడిగిస్తుందా? లేదా? వేచిచూడాల్సిందే. టాక్స్ పేయర్స్ డిమాండ్‌పై ఆర్థిక శాఖ ఇంకా స్పందించలేదు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి కొనసాగుతోంది. దీంతో న్యాయవాదుల పన్ను సంఘం ఎటిబిఎ, సేల్స్ టాక్స్ బార్ అసోసియేషన్‌లు ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఐటిఆర్ దాఖలు చేయడానికి గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. అయితే గతంలో ప్రభుత్వం మాత్రం ఐటిఆర్ గడువు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించింది.

ఇంకా 2 రోజులే ఉంది..
పన్ను చెల్లింపుదారులు గడువుకు ముందే ఐటిఆర్‌ని దాఖలు చేయడం ఉత్తమం, దీని కోసం జూలై 31 చివరి తేదీ వరకు వేచి ఉండకండి. ఆగస్టు 1 నుంచి ఐటిఆర్ ఫైల్ చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పన్ను బాధ్యత ఉండి కూడా టాక్స్ చెల్లించని వారికి ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు కూడా పొందవచ్చు. ఐటిఆర్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు సంపాదనకు సంబంధించిన సరైన వివరాలను అందించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News