Monday, December 23, 2024

నెలల ముందే ఐటిఆర్ ఫారాలను నోటిఫై చేసిన ఐటి శాఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను రిటర్న్‌లకు సంబంధించిన ఐటిఆర్1, ఐటిఆర్ 4 ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు( సిటిబిటి) శుక్రవారం నోటిఫై చేసింది. గత సంవత్సరం 2022 23ఆర్థిక సంవత్సరానికి ఐటి ఫారాలను ఐటి శాఖ 2023 బడ్జెట్ తర్వాత నోటిఫై ఈ ఏడాది మాత్రం దాదాపు మూడు నెలల ముందే నోటిఫై చేసింది. 2023 24కు సంబంధించి రిటర్న్‌లు ఫైలు చేయడానికి 2024 జులై 31 చివరి తేదీ.అంటే ఏడు నెలల ముందే నోటిఫై చేసినట్లు లెక్క. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐటిఆర్ పత్రాలను నోటిఫై చేస్తుంటారు.

గత ఏడాది ఫిబ్రవరిలో చేయగా, ఈ సారి ఏకంగా డిసెంబర్‌లో నోటిఫై చేశారు. 2023 24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి గాను 2024 25మదింపు సంవత్సరంలో రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తుల వార్షికాదాయం రూ.50లక్షలు మించనివారు ఐటిఆర్1(సహజ్)ను ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా రూ.50 లక్షలలోపు ఆదాయం కలిగిన అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు ఐటిఆర్ 4 (సుగమ్)ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News