Tuesday, November 5, 2024

6.7 కోట్లతో ఆల్‌టైమ్ హైకి చేరిన ఐటిఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జులై 31 గడువు ముగింపు నాటికి ఏడాదిలో ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) సంఖ్య 6.77 కోట్లతో సరికొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. దాదాపు 53.67 లక్షల కొత్త పన్ను చెల్లింపుదారుల రిటర్న్ ఫైల్ చేశారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఐటిఆర్ 16.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం పన్ను(ఐటి) శాఖ డేటా ప్రకారం, ఎలాంటి జరిమానా పడకుండా ఉండేందుకు ఆఖరి రోజు అయిన జులై 31న పెద్ద మొత్తంలో ఐటిఆర్‌లు ఫైల్ చేశారు.

ఇది మొత్తం ఐటిఆర్‌లలో 10 శాతం వరకు ఉంటుందని అంచనా. ఈసాకి కొత్తగా ఐటి రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఐటిఆర్ దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. జూలై 31 సాయంత్రం 6 గంటల వరకు 6.50 కోట్లకు పైగా ఐటిఆర్‌లు దాఖలయ్యాయి. వీటిలో చివరి రోజు మాత్రమే దాదాపు 36.91 లక్షల ఐటిఆర్‌లు ఫైల్ కావడం గమనార్హం. గడువు దాటితే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ. 5000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఉం రూ.1,000 జరిమానా చెల్లించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News