Monday, December 23, 2024

రైతుల ఫల రాజుకు గడ్డుకాలం

- Advertisement -
- Advertisement -

వేంసూరు : మామిడి సాగు ఏడాదికి ఏడాది రైతులకు నిరాశ మిగులుస్తోంది. దిగుబడి నివ్వని తోటల ద్వారా కనీసం ఆదాయం కూడా రాకపోవడంతో వేంసూరు మండలంలోని రైతులు తోటలను నరికేస్తున్నారు. 15 ఏళ్లుగా రైతులు కనీసం ఆదాయం కూడా రాని పరిస్థితుల్లో తోటలలోని మామిడి చెట్లను నరికి వేస్తూ తొలగించుకుంటున్నారు. ఏడాది మామిడి మామిడి రైతులకు నిరాశ మిగిలింది. ఎక్కువ శాతం రైతులు మామిడి సీజన్లోనే చెట్లను నరికి వేశారు.

ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. అధిక భాగం సత్తుపల్లి అశ్వరావుపేట నియోజక వర్గాలలోని మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. బంగినపల్లి,తోతాపురి,పెద్ద చిన్న, రసాలు, రకాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో ఉగాది పండుగకు ముందుగానే ఢిల్లీ, బొంబాయి, నుంచి మామిడి వ్యాపారులు ఈ ప్రాంతానికి తరలివచ్చి భారీ స్థాయిలో మార్కెట్లో ఏర్పాటు చేసుకొని, అక్కడక్కడ వారికి నమ్మకస్తులను (వ్యాపారులను) మామిడి జెగుబడి వచ్చే సమయానికి మార్కెటుకు వచ్చిన మామిడిని ఢిల్లీ నాగపూర్ హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ వస్తున్నారు.

వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పూత సమయం నుంచి దిగుబడి వరకు రైతులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పూత దశ నుంచి దిగుబడి వరకు మంగు తెగులు రైతులను కుంగ దీ స్తోంది. పూత దశ నుంచి దిగుబడి వరకు రైతులు మామిడి ని కాపాడుకుంటూ వస్తున్నారు. చివరకు కాయ కోత దశలో వస్తున్న వడగండ్ల వాన, కారణంగా ఈదురుగాలల వలన రైతులు నష్టపోయిన విషయం విధితమే. నేటి వరకు ఎకరానికి రూ.10,000లు చొప్పున నష్టపోయిన రైతాంగానికి, బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ప్రజా ప్రతినిధులు చెపుతూనే వస్తున్నారు.

కానీ నేటి వరకు అందలేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు తమ దృష్టి మళ్లిందని రైతులు మన తెలంగాణ కు తెలిపారు. మామిడి సాగు నవ్వకపోవడంతో గిట్టుబాటు కాకపోవడం వలన నరికి నరికి వేస్తున్నామని వారు తెలిపారు. వాటి స్థానంలో ఆయిల్ ఫామ్ కొబ్బరి, మొక్కజొన్న, సాగునుచేస్తున్నామని అన్నారు. మండలంలోని కల్లూరుగూడెం గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ, నిర్మా ణం జరుగుతున్న విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News