Friday, March 21, 2025

సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవడం సరికాదు: ఆర్జివి

- Advertisement -
- Advertisement -

బెట్టింగ్ యాప్‌లు ప్రమో చేస్తున్న పలువురు సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఆయన ‘శారీ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆర్జివి, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన విడుదల కానుంది.

సోషల్‌మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటే కలిగే ఇబ్బందులు ఏంటి అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సత్య యాదు, ఆరాధ్య దేవీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రయోట్ చేసిన వాళ్ల గురించి వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనే విషయం యాక్టర్స్, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు యాక్టర్స్‌కి అవగాహన కల్పించాలి. అంతేకానీ, సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అని వర్మ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News