Thursday, January 23, 2025

‘సెల్ఫిష్’లో చైత్రగా ఇవానా..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’తో వస్తున్నాడు. ఇందులో ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్లలో రెక్లెస్ యాటిట్యుడ్ చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్నా ఇవానాను చైత్ర పాత్రలో పరిచయం చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవానా ఎదో ఆందోళనలో వున్నట్లుగా కనిపించగా.. ఆశిష్ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు. ఈ కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్‌సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News