న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ శరీరంపై తీవ్రస్థాయి పదునైన గాయాలతోనే చనిపోయినట్లు న్యూయార్క్ ప్రధాన వైద్య అధికారి ఒకరు శనివారం తెలిపారు. అయితే ఆమె ఎటువంటి ప్రమాదానికి గురయ్యారు? అనేది వైద్య ప్రకటనలో కానీ పోలీసుల వివరణలో కానీ వెల్లడించలేదు. కానీ 73 సంవత్సరాల ఇవానా ట్రంప్ మన్‌హట్టన్‌లోని ఆమె నివాసంలో మెట్ల నుంచి జారిపడగా తగిలిన దెబ్బలతో మృతి చెందారనే అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని స్థానిక మీడియా తెలిపింది. స్థానికంగా ఉన్న ఇవాంక నివాసం నుంచి వచ్చిన కాల్‌కు వెంటనే పోలీసు అధికారులు వెంటనే స్పందించి అక్కడికి బృందంతో వెళ్లారని, అక్కడ ఇవాంక స్పృహతప్పి, అచేతనంగా పడిపోయి ఉండటం గమనించారని న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది. గురువారం ఇవాంక మృతి చెందారు. ఈ మృతిపై కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే ఎటువంటి నేరచర్య జరిగినట్లుగా తాము భావించడం లేదని, కేవలం ప్రమాదవశాత్తూ ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోందని పోలీసు విభాగం తెలిపింది.