Friday, November 22, 2024

కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడొద్దు

- Advertisement -
- Advertisement -
Ivermectin should not be used in covid treatment
వైద్య నిపుణుల హెచ్చరిక

వాషింగ్టన్ : మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్నజీవుల నివారణకు వాడే ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని … కొవిడ్ చికిత్సలో ఉపయోగించ వద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ను ఈ ఔషధం సమర్ధంగా అడ్డుకుంటుందని ఇప్పటివరకు ఆధారాలు లేవన్నారు. ఈ మందును అతిగా వాడితే వికారం, వాంతులు, మతిమరుపు, మూర్ఛ తోపాటు మరణం కూడా సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఐవర్ మెక్టిన్‌ను మనుషులతోపాటు శునకాలు, గోవులు, గుర్రాలకు వివిధ రూపాల్లో ఇస్తుంటారు. మనుషులకు వాడే ఈ ఔషధ డోసుల వల్ల దుష్ఫ్రభావాలు పరిమితంగానే ఉంటాయి.

జంతువుల కోసం ఉత్పత్తి చేసిన డోసులను మనుషులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఈ దుష్ప్రభావాలు వెయ్యి రెట్లు అధికంగా ఉండవచ్చు అని మిన్నెసోటా పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ బౌల్‌వేర్ పేర్కొన్నారు. అమెరికాలో పశువుల మందుల దుకాణాల నుంచి చాలా మంది కొవిడ్ రోగులు ఈ ఔషధాన్ని తీసుకెళ్లి వాడుతుండడం పట్ల వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్, బ్రెజిల్ దేశాల్లోనూ కొవిడ్ చికిత్సలో భాగంగా ఐవర్‌మెక్టిన్‌ను వినియోగిస్తున్నారు. ఎఫ్‌డిఎ సూచించిన వ్యాధులకు మాత్రమే ఈ మందును తగిన డోసుల మేర వాడుకోవాలి. ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు దీన్ని వాడడం తక్షణం ఆపేయాలిఅని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News