- Advertisement -
ఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో రోగులకు ఐవర్ మెక్టీన్ అనే డ్రగ్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐవర్‌మెక్టీన్ వాడిన వారు మరణశాతం తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 18 ఏళ్లు దాటిన వారికి ఐవర్‌మెక్టీన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామని గోవా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐవర్‌మెక్టీన్ డ్రగ్‌ను వాడొద్దని డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఏదైనా కొత్త మెడిసిన్ వాడుతున్నప్పుడు భద్రతతో పాటు సైడ్‌ఎఫెక్ట్ లేకుండా ఉండే డ్రగ్‌ను వాడాలని సూచించారు. క్లినికల్ ట్రయల్స్ లో తప్పితే కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టీన్ వాడొద్దని డబ్ల్యుహెచ్‌ఒ సిఫారసు చేసిందని సౌమ్య తెలిపారు.
- Advertisement -