Sunday, December 22, 2024

ఐవిఆర్‌ఎస్‌తో క్షణాల్లో విద్యుత్ ఫిర్యాదులు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అధికారులు హర్నిషలు కృషి చేస్తున్నారు.అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్నే కాకుండా ఇతర పద్దతలను కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా విద్యుత్‌కు సంబంధించిన అంతరాయాలు ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలోనే అధికంగా ఉంటాయని అధికారులు సైత ఒప్పుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక ప్రాంతం నుంచి విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ఫిర్యాదలు వస్తూనే ఉంటాయి.వాటిలో అధికంగా చెట్లు విరిగిపోవడంతో పవర్ పోయిందని, ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతరాయం కారణంగా పవర్ నిలిచిపోయిందని, విద్యుత్ తీగలు , పోల్స్ కిందపడ్డాయనే ఫిర్యాదులు అధికంగా వస్తుంటాయి.

ఇందుకు సంబంధించిన ఫిర్యాదులన్నీ ఫేస్‌బుక్, యాప్, వెబ్‌సైట్,డయల్ 100, 1912 వంటి వాటికి వెల్లువలా వస్తున్నాయి.దాంతో అధికారులు విద్యుత్ సంబంధిత ఫిర్యాదులను డయల్ 100 నుంచి స్వీకరించేలా కూడా ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు నుంచి వచ్చే ఫిర్యాదులు ముఖ్యంగా 1912కు అధికంగా వస్తుంటాయి.సాధారణ రోజుల్లో రోజుకు 2 వేల నుంచి 3 వేల ఫిర్యాదులు వస్తే ఒక్క వర్షాకాలంలోనే 65 వేల నుంచి 1లక్షల వరకు ఫిర్యాదులు వస్తుంటాయి. వీటన్నింటిని క్షణాల్లో పరిష్కరించేందుకు ఐవిఆర్‌ఎస్ (ఇంట్రాక్ట్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ను అధికారులు అందుబాటులోకి తీసుకు వచ్చారు. సాధారణంగా 1912కు విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన ఫిర్యాదులు ఒక్క సారే 20 లైన్స్ మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది.

ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయంలో సిబ్బంది కూడా షిఫ్ట్‌ల వారీగా 24గంటలు పని చేయాల్సి వచ్చేంది.అంతే కాకుండా ఇక్కడంతో మాన్యువల్‌గా విధానం ఉండటంతో కొన్ని సందర్భాల్లో సంబంధిత ఫిర్యాదులను పెద్దమొత్తంలో తీసుకునే అవకాశం ఉండేది కాదు..దాంతో కొన్ని కాల్స్ అకస్మాత్తుగా కట్‌కావడం, మిస్డ్‌కాల్స్‌గా నమోదు కావడం, తద్వారా సంబంధిత సమస్యలు అపరిష్కృతంగా ఉండేవి. ఇటువంటి సమస్యలపై దృష్టి సారించిన ఐవిఎర్‌ఎస్‌ను అమల్లోకి తీసుకు వచ్చారు. దీని ద్వారా వినియోగ దారులు సమస్యలను క్షణాల్లో పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా ఒక్క సారిగా 300 ఫిర్యాదులను స్వీకరించడంతో క్షణాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఈ విధానం ద్వారా ప్రతి వినియోగదారుని పిర్యాదు రికార్డు చేసి ఉండటంతో ఎటువంటి విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ విధానం గ్రేటర్‌లోని సికింద్రాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ రాజేంద్రనగర్, హబ్సీగూడ, సరూర్‌నగర్, సైబర్ సిటీ,మేడ్చెల్ సర్కిళ్ళలోనే దీన్ని అమలు చేస్తున్నారు. వినియోగ దారుల నుంచి ఐవిఆర్‌ఎస్‌కు మంచి స్పందన రావడంతోగ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News