న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో బిజెపి ఆక్రమణల నిరోధక డ్రైవ్(యాంటీఎంక్రోచ్‌మెంట్ డ్రైవ్)ను కొనసాగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ధ్వజమెత్తారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఉపాధి, వ్యాపారం, ప్రేమను కోరుకుంటోంది, కానీ బిజెపి బుల్‌డోజర్‌ను పొందింది అన్నారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన ఆ డ్రైవ్‌పైన కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, పిడిపి పార్టీలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. వెంటనే దానిని ఆపేయాలని కూడా డిమాండ్ చేశాయి.
జమ్మూకశ్మీర్‌లోని ఆక్రమణలను నూరు శాతం తొలగించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యదర్శి విజయ్ కుమార్ బిధూరి డిప్యూటీ కమిషనర్లు అందరికీ ఆదేశించడంతో అధికారులు ఇప్పటి వరకు 10 లక్షల కెనాల్స్(ఒక కెనాల్= 605 చదరపు గజాలు) రాష్ట్ర భూమిని జనవరి 7న స్వాధీనం చేసుకున్నారు.
రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ‘జమ్మూకశ్మీర్‌కు కావలసింది ఉపాధి, చక్కని వ్యాపారం, ప్రేమ కానీ వారికి దొరికిందేమిటి? బిజెపి బుల్‌డోజర్!’. ఎన్నో దశాబ్దాలుగా వారు ఆ భూమిలో పంటలు పండించుకుంటుంటే, వాటిని వారి నుంచి లాక్కుంటున్నారు. శాంతి, కశ్మీరియత్ రక్షణ అనేది కలుపడంతో సాధ్యపడుతుంది, విభజించడంతో కాదు.
తొలగింపు డ్రైవ్ జమ్మూకశ్మీర్‌లో భయాందోళనలకు గురిచేస్తోందన్న మీడియా నివేదికను రాహుల్ గాంధీ ట్యాగ్ చేశారు.
जम्मू-कश्मीर को चाहिए रोज़गार, बेहतर व्यापार और प्यार, मगर उन्हें मिला क्या? भाजपा का बुलडोज़र!
कई दशकों से जिस ज़मीन को वहां के लोगों ने मेहनत से सींचा, उसे उनसे छीना जा रहा है।
अमन और कश्मीरियत की रक्षा, जोड़ने से होगी, तोड़ने और लोगों को बांटने से नहीं। pic.twitter.com/K8kJAn20H7
— Rahul Gandhi (@RahulGandhi) February 12, 2023