Monday, December 23, 2024

జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్లు

- Advertisement -
- Advertisement -

కర్ణాటక బీజేపీ విభాగం సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్ట్ పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీస్‌లు బుధవారం సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరు కావాలని అందులో కోరారు. హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఈ సమన్లు పంపారు. ముస్లింల రిజర్వేషన్‌కు కాంగ్రెస్ సానుకూలంగా ఉందంటూ బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎస్‌సీలు, ఎస్టీలు, ఒబిసీలతో పోలిస్తే ముస్లింలకు పెద్దమొత్తంలో నిధులను రాహుల్ గాంధీ , సిఎం సిద్ధరామయ్య , కేటాయిస్తున్నారని, ఆ వీడియోలో బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News