Saturday, December 21, 2024

ముమ్మరంగా జాన్‌పహాడ్ రోడ్డు విస్తరణ పనులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: నేరెడుచర్ల పట్టణంలోని జాన్‌పహాడ్ రోడ్డ విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు గురువారం ముమ్మరం చేశారు. గత కొంత కాలంగా విస్తరణ పనుల తీవ్ర జాప్యంతో పాటు పలు ఒత్తిడి కారణంగా పనులు జాప్యం అవుతూ వచ్చాయి. కొంత మంది దుకాణాదారులు నివాస గృహాల వారు స్వచ్చందంగా తొలగించుకోగా మరి కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో పనులు నత్తనడకన సాగాయి.

దీంతో గురువారం తెల్లవారుజామున పోలీస్ పహారా నడుమ అధికారులు తొలగి ంపు పనులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, గుత్తేదారులు సంయుక్తంగా ఆరు జేసీబీలను రప్పించి సుమారు 50మంది పోలీసులను మోహరించి రహదారికి ఇరువైపులా 33అడుగుల మేరకు గతంలో మార్కింగ్ చేసిన ప్రకారం తొలగింపులు చేపట్టారు. తొలగింపు కార్యక్రమం పూర్తయితే ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించిన అనంతరం ఫుట్‌పాత్, సెంట్రల్ లైటింగ్ చేపట్టనున్నారు. గతంలో రామాపురం,పాత నేరెడుచర్ల రోడ్డులో విస్తరణ పనులు చేపట్టి రోడ్డుకు ఇరువైపులా 20అడుగుల మేర తొలగించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News