పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ సినిమాతో దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్, ఆర్‌కె ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు.
తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. “మేము ఓ కొత్త లవ్ స్టోరీతో రాబోతున్నాము. ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న అందరి ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన ధనుష్‌కి థాంక్స్. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను” అని అన్నారు. ఈ సమావేశంలో అనికా సురేంద్రన్, రబియా, వెంకటేష్ మీనన్, రమ్య రంగనాథన్, పవిష్ పాల్గొన్నారు.