Monday, December 23, 2024

అవినీతి సంపద అదాని, అంబానీలకు దోచి పెట్టారు: వెంకటేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణ భారతం నుంచి జాతీయ పార్టీ పెట్టిన మొదటి వ్యక్తి సిఎం కెసిఆర్ అని బిసి సంఘాల జెఎసి ఛైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ తెలిపారు. ఆదివారం వెంకటేశం మీడియాతో మాట్లాడారు. బిజెపి పాలనలో అవినీతి సంపద అదాని, అంబానీలకు దోచి పెట్టిన తీరు, రైతులను వేధించిన తీరు బయట పడుతుందన్నారు. బిజెపి రాష్ట్రంలో ఈ వేధింపులకు పాల్పడుతోందన్నారు.

ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న తీరుపై పిఎం మోడీని ప్రశ్నించారు. సిఎం కూతురు కవితపై రాజ్యాంగ సంస్థలను పంపుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ వ్యవస్థలను సిబిఐ, ఈడి లాంటి సంస్థలను దుర్వినియోగ పరుస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను బిజెపి అక్రమించుకోవాల్ని చూస్తోందని వెంకటేశం దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షాలు వచ్చాక ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్నంగా పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు బిజెపి కేంద్రంలో వస్తే నల్ల ధనం తీసుకవచ్చి 15 వేలు వేస్తామని చెప్పి నల్ల ధనం ఇంకా పెంచడంతో పాటు పేదల సొమ్మును పెట్టుబడి దారులకు దోచి పెడుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ అండగా ఉన్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News