హైదరాబాద్: ఆసీస్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఇద్దరికి జాక్ పాట్ తగిలింది. కాంట్రాక్ట్ జాబితాలో ఇద్దరికి బిసిసిఐ చోటు కల్పించింది. సర్ఫరాజ్, ధ్రువ్‌కు గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించింది. బిసిసిఐ కాంట్రాక్ట్ సొంతం కావాలంటే మూడు టెస్టులు, ఎనిమిది వన్డేలు, పది టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్, ధ్రువ్ మూడు టెస్టులు ఆడడంతో సి గ్రేడ్ జాబితాలోకి తీసుకున్నారు. దీంతో సి గ్రేడ్ జాబితాలో ఉన్నవారికి కోటి రూపాయల వార్షిక వేతనం బిసిసిఐ ఇవ్వనుంది.
ఇంగ్లాండ్ సిరీస్‌లో సర్ఫరాజ్ మూడు టెస్టులు మ్యాచ్‌లు ఆడి మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా రాంచీ టెస్టులో 90, 39 పరుగులు సాధించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.
సర్ఫరాజ్, ధ్రువ్‌కు జాక్‌పాట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -