- Advertisement -
జొహన్నెస్‌బర్గ్ :దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు న్యాయస్థానం మంగళవారం 15 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై కోర్టు విచారణ చేపట్టగా, విచారణకు హాజరు కాకపోవడాన్ని ్ట దిక్కారంగా కోర్టు పరిగణించి శిక్ష విధించింది. 79 ఏళ్ల జాకబ్ 2009 నుంచి 2018 వరకు అధ్యక్షునిగా పదవిలో ఉన్న కాలంలో దేశ ఖజానా దోపిడీకి అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జాకబ్ కోర్టులో హాజరు కాలేదు. తనకు తాను అయిదు రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమాచారం అందించకుంటే ఆయన అరెస్టుకు పోలీస్ మంత్రి ఉత్వర్వులు జారీ చేస్తారు.
- Advertisement -