Monday, April 7, 2025

ప్రముఖ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాడెజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాడెజ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీలంక వాసి అయిన జాక్వాలిన్.. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అల్లాదీన్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డును సొంతం చేసుకుంద. ఆ తర్వాత మర్డర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2 వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే జాక్వలిన్ తల్లి కిమ్ మార్చి 24వ తేదీన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఈ కారణంగానే గువాహటిలో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో జాక్వలిన్ ప్రదర్శన చేయలేదు. ఆదివారం ఆమె చికిత్స పొందుతూ.. మరణించారు. దీంతో జాక్వలిన్‌ని పరామర్శించేందుకు సెలబ్రిటీలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News