- Advertisement -
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త తండా సమీపంలో స్కూల్ బస్సును వెనుక లారీ ఢీకొట్టడంతో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్కూల్ బస్సు విద్యార్థులతో జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: బాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీలో పూజలు
- Advertisement -