- Advertisement -
జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ కిందికి కారు దూసుకపోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాదారులు కారులో ఉన్న ముగ్గురిని బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంగా వెళ్లి కంటైనర్ కిందకు దూసుకెళ్లిందన్నారు. చలికాలంలో తెల్లవారుజామున మంచు ఎక్కువగా కురియడంతో ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. .
- Advertisement -