హైదరాబాద్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బజ్‌బాల్‌పై భారత బ్యాట్స్‌మెన్లు ఆధిపత్యం చెలాయించారు. తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ 246 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 76 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) ఉన్నారు. టెస్టుల్లో జడేజా-అశ్విన్ అరుదైన రికార్డు అధిగమించారు. 50 మ్యాచ్‌ల్లో అశ్విన్-జడేజా జంట 504 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. గతంలో 54 మ్యాచుల్లో 501 వికెట్లు తీసిన ఘనత కుంబ్లే-హర్బజన్ సింగ్ జంట ఖాతాలో ఉంది. మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కెఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో అశ్విన్, జడేజా, కోహ్లీ, రోహిత్, ధోనిలు ఉన్నారు. ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు జోయ్ రూట్ బద్దలు కొట్టాడు. జోయ్ రూట్ 26 మ్యాచ్‌ల్లో 2555 పరుగులు చేయగా సచిన్ 32 మ్యాచ్‌ల్లో 2535 పరుగులు చేశాడు.
వారి రికార్డును బద్ధలు కొట్టిన అశ్విన్-జడేజా జంట
- Advertisement -
- Advertisement -
- Advertisement -