Sunday, November 17, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: జడేజాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కినెట్టి జడేజా అగ్రస్థానానికి చేరుకున్నాడు. కొంత కాలంగా బంతితో బ్యాట్‌తో నిలకడగా రాణిస్తున్న జడేజా కెరీర్‌లో తొలిసారి టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. 386 రేటింగ్ పాయింట్లతో జడేజా టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. హోల్డర్ రెండో, బెన్‌స్టోక్స్ (ఇంగ్లండ్) మూడో ర్యాంక్‌లో నిలిచారు.

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో, బంగ్లాదేశ్ స్టార్ షకిబ్ అల్ హసన్ ఐదో ర్యాంక్‌ను సాధించారు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో, మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా) మూడో ర్యాంక్‌లో నిలిచారు. భారత సారథి విరాట్ కోహ్లి తన నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, రోహిత్ శర్మలు సంయుక్తంగా ఆరో ర్యాంక్‌లో నిలిచారు.

Jadeja become No 1 in ICC Test Allrounder Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News