Monday, December 23, 2024

ఐసీసీ ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో రవీంద్ర జడేజా..

- Advertisement -
- Advertisement -

Jadeja becomes No 1 All Rounder in ICC Test Rankings

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. తాజాగా ఐసిసి టెస్టు క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో జడేజా 406 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జడేజా 175 పరుగులతో అజేయంగా నిలువడమే కాకుండా.. బౌలింగ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐసిసి ర్యాంకింగ్స్‌లో జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోగా, రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక, టెస్టు బ్యాట్స్ మెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ తొలి స్థానంలో ఉండగా.. జో రూట్ రెండో స్థానలంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా, రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. టీమిండియా యువ కెరటం రిషబ్ పంత్ పదో స్థానానికి చేరుకున్నాడు.బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

Jadeja becomes No 1 All Rounder in ICC Test Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News